|
డీఎంకే చీఫ్ కరుణానిధి ఎనిమిది పదుల వయసులోనూ అవిశ్రాంతంగా కష్టపడుతూ సుపరిపాలన అందిస్తున్నారని, ఆయనను చూస్తే భీష్ముడు గుర్తుకు వస్తున్నారని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. విల్లుపురం జిల్లా రిషివందియం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శివరాజ్‌కు మద్దతుగా ఆయన సోమవారం ప్రచారం చేశారు. కేంద్రం గత ఐదేళ్లలో తమిళనాడుకు కేటాయించినన్ని నిధులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించలేదన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే డీఎంకేను గెలిపించాలని కోరారు.

0 comments:
Post a Comment