తమిళనాడు ఎన్నికల బరిలోకి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత.. రామ, రావణాసురులను కూడా లాగారు. ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి అలనాటి రావణుడని ఆమె అన్నారు. ‘ఆనాడు రాముడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి రావణుడు సీతను ఎత్తుకెళ్లాడు. అదే విధంగా ఓటమి భయంతో కరుణ అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బులిస్తే అన్నాడీఎంకే ఆత్మవిశ్వాసం కోల్పోతుందనుకుంటున్నాడు. ఆనాడు రాముడు గెలిచినట్లే మా పార్టీ కూడా విజయం సాధిస్తుంది’ అని ఆమె సోమవార మిక్కడ ఎన్నికల సభలో అన్నారు.
0 comments:
Post a Comment