
జన్ లోక్‌పాల్ బిల్లు రూపకల్పన కమిటీ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోతో అన్ని సమస్యలూ తీరిపోలేదని, తమ గమ్యం ఇంకా చాలా దూరంలో ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే పేర్కొన్నారు. బిల్లును పార్లమెంటు ఆమోదించేంతవరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఢిల్లీలో లోక్‌పాల్ బిల్లు కమిటీ కోసం నాలుగు రోజుల నిరాహార దీక్ష చేపట్టి విజయం సాధించిన ఆయన సోమవారం తన స్వగ్రామైన మహారాష్టల్రోని రాలెగావ్ సిద్ధికి చేరుకున్నారు. గ్రామ ప్రజలు హజారేకు ఘనస్వాగతం పలికారు. తర్వాత ఆయన ను మేళతాళాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హజారే ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించాలంటే చాలా ప్రక్రియ ఉంది. దేశాభివృద్ధికి అధికార వికేంద్రీకరణతోపాటు ఎన్నికల విధానాలను సంస్కరించాలి. నా ఆందోళన ఇంత త్వరగా దేశమంతటా వ్యాపిస్తుందని ఊహించనే లేదు. ఇది నమ్మశక్యంగా లేదు’ అని ఆయన అన్నారు.
Tagged as : Lokpaal
0 comments:
Post a Comment