|
ఏదైనా మనస్సులో ఉన్నది ఉన్నట్లు నిర్మొహమాటంగా మాట్లాడే భారత సారథి మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన మనస్సులోని మాటను వెలిబుచ్చాడు. ఈ సంవత్సరం తయారుచేసిన బిజీ క్రికెట్ షెడ్యూల్‌తో ఆటగాళ్లు మానసింగా, శారీరకంగా తీవ్ర అలసిపోతారని ధోని అన్నాడు.
ఇది ఆటగాళ్ల ఆటతీరుపై ప్రభావం చూపుతుంది, ఎలాగోలా శారీరక అలసటను తట్టుకోగలిగినా మితిమీరిన ఆటతో మానసింగా తీవ్రంగా అలసిపోతారని పాత్రికేయులతో జరిగిన సమావేశంలో ధోనీ చెప్పాడు. 40 రోజుల పాటు సాగిన ప్రపంచ కప్ ముగిసిన వారం లోపే ఐపీఎల్-4 ప్రారంభం కానుంది. ఇది 50 రోజుల పాటు సాగనుంది.
ఐపీఎల్ తర్వాత ఈ సంవత్సరం భారత జట్టు వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో ఆడాల్సివుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బిజీ షెడ్యూల్‌తో ఆటగాళ్లకు అలసట తప్పదని ధోనీ వ్యాఖ్యానించాడు.

0 comments:
Post a Comment