|

కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి విజయం సాధించే అవకాశాలు ఏమాత్రం లేవని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. ఆయన గురువారం కడప ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగులో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ వైఎస్ జగన్ పార్టీ గెలిచే అవకాశాలు లేవన్నారు. ఒకవేళ గెలిచినా జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అంతకంటే లేవన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తన హయాంలో లక్ష కోట్ల రూపాయలు సంపాదించి తన తనయుడైన జగన్‌కు కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు గెలుపొందడానికి డబ్బులు పంచుతున్నాయని జగన్ ఆరోపించడం విచిత్రంగా ఉందన్నారు.
రాష్ట్రంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా లేదా కానీ జగన్‌కు మాత్రం ఊరూరా కోట్లాది రూపాయల విలువ చేసే ఇళ్లు ఉన్నాయని ఆరోపించారు. భవిష్యత్‌లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటామనే విషయాన్ని జగన్ చెప్పకనే చెప్పారన్నారు. కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డితో సత్ సంబంధాలు ఉంటే భాజపాతో స్నేహం ఉన్నట్టేనన్నారు.

125 సంవత్సరాల పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఎందుకూ పనికిరాకుండా పోయిందన్నారు. ఇలాంటి అసమర్థ కాంగ్రెస్ పార్టీ, అవినీతి జగన్‌కు ఓటు వేయవద్దని ఓటర్లకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు నీతికి - అవినీతికి మధ్య పోరుగా ఆయన అభివర్ణించారు.

0 comments:
Post a Comment