|

తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాదన్నా.. ఔనన్నా తాము నిర్వహించదలచిన తెలంగాణ సభ జరిగి తీరుతుందని ఆ పార్టీ సీనియర్ నేత, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు. దీనిపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 9వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులో తెలంగాణ సభ జరిగి తీరుతుందని నొక్కివక్కాణించారు.
ఎవరికి తోచిన పద్ధతిలో వారు ప్రజలకు సన్నిహితం కావాలని పార్టీ సూచించిందని, ఆ మేరకే తాను 9వ తేదీన తెలంగాణ సభను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ బహిరంగ సభలో తెలంగాణ ప్రజా సంఘాలు పాల్గొంటాయని ఆయన చెప్పారు. తెలంగాణ కోరుకునేవారంతా ఈ సభలో పాల్గొనవచ్చునని, అలాంటి వారందరూ ఆహ్వానితులేనన్నారు.
తెలంగాణ కోసం తనను ఆహ్వానిస్తే వెళ్తున్నానని ఆయన చెప్పారు. 9వ తేదీ సభకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణవాదులంతా కలిసి పని చేయాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అన్ని పార్టీల తెలంగాణ నాయకులు కలిసి పోరాడితే మంచిదన్నారు. తెంగాణ ప్రాంతానికి చెందిన సొంత పార్టీ నేతలు కొందరు తనపై చేసిన విమర్శలపై తానేమీ స్పందించబోనన్నారు

0 comments:
Post a Comment