|
జన బాంధవుడు పుట్టపర్తి సత్యసాయి బాబా లేనిలోటు పూడ్చలేనిదని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. సత్యసాయి మరణంపై పలువురు పలు రకాలుగా సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఒకింతి మనస్తాపానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. బాబా లేనిలోటు పూడ్చలేనిదంటూ పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలు మానవాళి ఉన్నంత వరకు స్థిరస్థాయిగా నిలిచి పోతాయన్నారు. అలాగే, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సంతాపం ప్రకటించారు. మానవుల్లో మంచి పెంపొందించేందుకు బాబా తన జీవితాన్ని అంకితం చేశారని సంతాప సందేశంలో పేర్కొన్నారు.
అలాగే, భగవాన్ సత్యసాయి బాబా మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.

0 comments:
Post a Comment