|
పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాభినిష్క్రమణం చాలా బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఉదయం బాబా మరణవార్త తెలుసుకున్న తర్వాత ఆయన తన ఉప ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. బాబా మరణంపై ఆయన మాట్లాడుతూ ప్రేమ, దయ, కరుణ, సేవలే జీవన మార్గాలుగా బాబా బోధించారన్నారు. సాయి బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరించడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని జగన్ పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఆయన పుట్టపర్తికి బయలుదేరారు.

0 comments:
Post a Comment