|
విలువలతో ముందుకు పోయిన మహోన్నత వ్యక్తి సత్య సాయి అని,ఆయన మరణం నమ్మసఖ్యం కాని వార్త అని సత్య సాయి పార్థివ శరీరమును దర్శించిన అనంతరము చంద్రబాబు ఈ విధంగా అన్నారు.ఆయన లేకపోయినా ఆయన స్ఫూర్తి మనతో ఉందని ఆయన జీవితం ఆదర్శమని ఆయన తన ప్రభోధనలతో యావత్ ప్రపంచాన్ని ఆకర్షించారన్నారు 125 దేశాల్లో ఎక్కడికక్కడ మంచి నీరు ,విద్య , వైద్యం తో ప్రజలకు ఎంతో సేవ చేసిన మహనీయుడు, విలువల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిన గొప్ప మానవతావాది అన్నారు .
సమాజానికి ఆయన ఇచిన్న విలువల్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ట్రస్ట్ దే అన్నారు . బౌతికం గా ఆయన మనతో లేకపోయినా ఆ స్ఫూర్తి విలువలతో మనం ముందుకు పోవాలని ఆయన ఆత్త్మకు శాంతి చేకూరాలని ఆయన తన ప్రగాడ సానుభూతి తెలియచేసారు.

0 comments:
Post a Comment