|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి ప్రతీక ఈ ఉప ఎన్నికలు అని రాష్ట్ర మంత్రి పార్థసారిథి అభిప్రాయపడ్డారు. కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసం తమ సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజలపై ఉప ఎన్నికల భారం మోపారని ఆయన ఆరోపించారు.ఆయన వేంపల్లేలో మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికలు అనేవి చనిపోతోనో, లేక ప్రజా సమస్యల కోసం పోరాటం కోసమే, రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్తారని, కానీ, జగన్ కేవలం స్వార్థం కోసం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న ఏకైక ఆకాంక్షతోనే కాంగ్రెస్ పార్టీని వీడి కొత్త రాజకీయ పార్టీని స్థాపించారన్నారు. సోనియా గాంధీ బొమ్మ, కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచి నేడు అదే సోనియాను కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ పథకాలు కుంటుపడుతున్నాయని జగన్ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

0 comments:
Post a Comment