|
మంత్రులు ఢిల్లీ, హైదరాబాద్ నుంచి కడపకు డబ్బుల సంచులు మోసుకొస్తున్నారని, వారికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప లోక్‌సభ అభ్యర్థి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన పులివెందుల నియోజకవర్గం పరిధిలోని లింగాల మండలంలో విస్తృతంగా రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తనను, తన తల్లిని ఓటమిపాలు చేయడానికి, ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్, టిడిపి వారు కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. తన పేరు, తన తల్లి పేరు ఉన్న వారితో కడప, పులివెందులలో నామినేషన్లు వేయించారని ధ్వజమెత్తారు.
జిల్లాతో పాటు రాష్టవ్య్రాప్తంగా ప్రతి ఒక్కరి గుండెల్లో వైఎస్ ఉన్నారని వారందరి అభీష్టం మేరకే తాను, తన తల్లి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని అన్నారు. మంత్రులు కులాలు, మతాల పేర ఓటర్లను చీల్చాలని చూస్తున్నారని అన్నారు. దివంగత నేత రాజశేఖరరెడ్డిపై ఉన్న ప్రజాభిమానం చెక్కుచెదరలేదని, పులివెందులలో తన తల్లి విజయలక్ష్మిను, కడపలో తనను ఆదరిస్తారని అన్నారు.

0 comments:
Post a Comment