అవినీతి నిరోధక ఉద్యమాన్ని అణిచేందుకు రాజకీయ శక్తులు కుట్ర పన్నుతున్నాయని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే పేర్కొన్నారు. ‘రాజకీ య విద్రోహ శక్తులు జాతి మొత్తాన్ని అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పక్కదోవ పట్టిచ్చేందుకు చూస్తున్నది’. అని హజారె తెలిపారు. ఉద్యమాన్ని చూసి కొన్ని రాజకీయ శక్తులు వణికాయన్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లుపై అశేష ప్రజానీకం నుంచి విశేషమైన మద్ధతు వచ్చిన తరవాత విద్రోహశక్తులు కార్యచరణను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని హజారె రాలెగాన్ సిద్ధి గ్రామంలో వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 16న జరిగే జన్‌లోక్‌పాల్ బిల్లు తొలిసమావేశంలో పాల్గొనటానికి అన్నా ఈ రోజు న్యూఢిల్లీకి వెళతారు.దేశంలోని రాజకీయనాయకులందరూ అవినీతిపరులని నేనేప్పుడు చెప్పలేదని హజారె చెప్పారు. అయితే రాజకీయనాయకుల్లో ఎ క్కువమంది అవినీతికి పాల్పడుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment