|
కడప ఉప ఎన్నికల్లో కోట్లు కుమ్మరిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్, అధికార కాంగ్రెస్‌పై చంద్రబాబు ధ్వజమెత్తారు. నేతల తలలకు వెల కట్టి కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారని బాబు ఆరోపించారు. తండ్రి అధికారంలో ఉండగా లక్షల కోట్లు సంపాదించి ఇపుడు ఒక్క ఓటును రూ. 5000కు కొంటున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కలలో కూడా సీఎం...సీఎం అని కలవరిస్తున్నారని, పార్టీకి ఓ సిద్ధాంతం లేదు...ఒక పద్ధతి లేదూ... మాట్లాడితే దాని మీద తొలి సంతకం చేస్తా... దీనిమీద తొలి సంతకం చేస్తా... అని జగన్ సీఎం అయినట్లు కలలు కంటున్నాడని బాబు ఎద్దేవ చేశారు. కడప ఉప ఎన్నికలు నీతి, అవినీతికి మధ్య జరుగుతున్నాయని బాబు అన్నారు.
www.Suryaa.com
0 comments:
Post a Comment