|
వైఎస్ ఆశయ సాధనకోసం కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కడపలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధికార దాహం లేదని, వైఎస్ సేవాభావం కలిగిన నేత అని రోశయ్య అన్నారు. ఈ సందర్భంగా రోశయ్య మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్ని ఖచ్చితంగా అమలులవుతున్నాయన్నారు. వైఎస్ రాజకీయ వారసత్వం ముమ్మాటికీ కాంగ్రెస్‌దేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ప్రత్యేక కోణంలో చూడాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను కాకుండా ఇతరులు ఎన్నికైతే ప్రజలకు ఎలా సాయపడతారని రోశయ్య ప్రశ్నించారు.
www.Suryaa.com
0 comments:
Post a Comment