20 April 2011

జగన్‌పై రాహుల్ గాంధీ పోటీ చేసినా గల్లంతే: సురేఖ

కాంగ్రెస్ పార్టీ రెబల్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్గం నాయకురాలు ఫైర్‌బ్రాండ్ కొండా సురేఖ మరోసారి కాంగ్రెస్ అధిష్టానంపై నిప్పులు చెరిగింది. కడప లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలో వైఎస్ జగన్ పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని తీసుక వచ్చి పోటీ చేయించినా డిపాజిట్లు గల్లంతవుతాయని ఆమె జోస్యం చెప్పారు.
అంతేకాదు పులివెందులలో విజయమ్మపై సోనియా గాంధీ పోటీ చేస్తే సోనియాకు ఒక్క ఓటు కూడా రాదని ధీమా వ్యక్తం చేశారు. కడప, పులివెందుల ప్రజలు జగన్, విజయమ్మలకు మూకుమ్మడిగా ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉపఎన్నికల అనంతరం జగన్ ప్రభంజనం ఏమిటో కాంగ్రెస్ పార్టీకి తెలుస్తుందన్నారు.
జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ చిల్లర పనులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. జగన్ వెంట నడుస్తున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని బెదిరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆ హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసిన ప్రజారాజ్యం పార్టీని ఎప్పుడు ఆహ్వానించారో... అప్పుడే వారిపై వారు అనర్హత వేటు వేసుకున్నట్లు తేలిపోయిందన్నారు.
ఏదేమైనా వచ్చే ఆగస్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముప్పు తప్పదన్నారు. ఆ రెండూ ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో కూలిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

Congress, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us