|
ఉప ఎన్నికల్లో గెలుపును నమోదు చేసుకున్నప్పటికీ, ఆయన వ్యాపారాలే చూసుకుంటారని కన్నా ఆరోపించారు. అలాంటి వ్యక్తి వల్ల ప్రజలకు వచ్చే ఒరిగేదేమీ లేదని కన్నా వ్యాఖ్యానించారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని గెలిపించాలని మంత్రి కన్నా ప్రజలను కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బాటలోనే తాము నడుస్తున్నామని కన్నా చెప్పారు. ఏ చిన్న ఆరోపణలకైనా విచారణ జరిపించే వారని కన్నా అన్నారు.
వైఎస్సార్ హయాంలో జరిగిన భూకేటాయింపులపై హౌస్ కమిటీ వేయడంలో తప్పులేదన్నారు. వైఎస్ వల్లే కాంగ్రెస్ గద్దెక్కలేదని, కాంగ్రెస్ చలువతోనే వైఎస్సార్ అంతెత్తుకు ఎదిగారని మంత్రి వ్యాఖ్యానించారు.

0 comments:
Post a Comment