|

హటాత్తుగా నాగం అసలు ఇంతవరకూ తెలంగాణపై స్పష్టత ప్రకటించిన జగన్ హీరో అవుతారని, తెలంగాణకు వ్యతిరేకం కాదని ప్రకటించిన టీడీపీకి క్రెడిబిలిటీ లేదని వ్యాఖ్యానించడం విశేషం. శుక్రవారం టీడీఎల్పీ వద్ద మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడిన నాగం తెలంగాణ రావడం ఖాయమని, తెలంగాణలో జగన్ హీరో అవుతారని వ్యాఖ్యానించి అందరినీ విస్మ యపరిచారు. అయితే, జగన్ సమైక్యాంధ్రకు మద్ద తుగా పార్లమెంటులో ప్లకార్డులు పట్టిన విషయాన్ని మీడియా ప్రతినిధులు గుర్తు చేసి, ఆయనకు క్రెడిబి లిటీ ఎలా వస్తుందని ప్రశ్నించారు. ‘అయినా సరే జగన్‌కే తెలంగాణలో క్రెడిబిలిటీ ఉంది. తెలంగా ణపై స్పష్టత లేదు కాబట్టి మాకు అది లేదు’ అన్నారాయన.
see more in www.Suryaa.com

0 comments:
Post a Comment