|
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ‘అమూల్ బేబీ’ అంటూ కేరళ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ చేసిన వ్యాఖ్యల్లో అనౌచిత్యమేదీ తనకు కనిపించడం లేదని కేరళ కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ అన్నారు. అచ్యుతాందన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులంగా ముక్తకంఠంతో, తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో శశిథరూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆ వ్యాఖ్యలు అవమానకరంగా తాను భావించడం లేదని థరూర్ తన ట్విట్టర్‌లో బుధవారంనాడు పేర్కొన్నారు. ‘అమూల్ బేబీ’ వ్యాఖ్యల్లో అవమానకరమైన అర్థాన్ని చూడొద్దు’ అని థరూర్ అన్నారు. ‘అమూల్ బేబీ’లు, బలంగా ఉంటారు. అమూల్ బేబీ అంటే మంచి భవిష్యత్‌కు నిదర్శనమన్నారు.

0 comments:
Post a Comment