|
కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లే అంశంపై ఆలోచిం చుకోవాలంటూ టీడీపీ తెలంగాణ నేతలకు నాగం జనార్ధనరెడ్డి సూచించడంపై టిడిపి అధికార ప్రతినిధి మండిపడ్డారు. పార్టీ కల్పించినే అవకాశాలతో పెద్దనేతలుగా చెలామణి అయి ఇప్పుడు పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారానికి వెళ్లే వాళ్లను ఆలోచనల్లో పడే స్తారా? అంటూ ఆయన నాగంనుద్ధేశించి పరోక్షంగా నిలదీశారు. అందరి అభిప్రా యాలు తీసుకున్నాకే అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంత నేతలను కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లమన్నారన్నారు.
అధిష్టానం ఆదేశాలను ఎంతటి పెద్దవా రైనా శిరసావహించాల్సిందేనని, అతీతులు కారన్న సంగతి గుర్తుంచుకుంటే మంచిద న్నారు. పార్టీ ఉంటేనే లీడర్, క్యాడర్ ఉంటుంది. పార్టీనే లేక పోతే ఏ లీడర్ అయినా ఎక్కడుంటారో ఆలోచించుకోవాలి? అని రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ వేదికల మీద మాట్లాడే పెద్దలు తమ స్వంత అజెండానే పార్టీకి రుద్దాలని చూస్తున్నారని, ఇలాంటి వా రిపై చర్యలు తీసుకోవాలంటూ తాము అధినేతకు ఫిర్యాదు చేస్తామన్నారు. చర్యలు తీసు కోక పోతే క్రమశిక్షణ కట్టుదాటినట్లవుతుందని, ఈ రోజు నాగం జనార్ధనరెడ్డి మాట్లాడితే రేపు మరొకరు మాట్లాడే పరిస్థితికి అవకాశం ఇచ్చినవారమవుతామన్నారు.

0 comments:
Post a Comment