|
ఉప ఎన్నికల ఫలితాలు వెలువడే రోజైన మే 13వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసి పోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి టి.తులసి రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌కు, వైఎస్.జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పోటీ అనడాన్ని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడైన వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పూర్తి పేరైనా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పూర్తిగా చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. ఈ పార్టీకి ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పకుండా విజయం సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యంగా కడప లోక్‌సభకు పోటీ చేస్తున్న అభ్యర్థి డీఎల్.రవీంద్రా రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించేందుకు ఓటర్లు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు

0 comments:
Post a Comment