|
మంత్రి పదవి కోసం సీఎం బంగ్లాలచుట్టూ తాను ప్రదక్షిణలు చేయలేదని, ప్రభుత్వానికి, పార్టీకి తన సేవలు అవసరం ఉన్నంతకాలం మంత్రి పదవిలో కొనసాగుతానని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డీ.ఎల్.రవీంద్రారెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలో విలేకరు లతో మాట్లాడుతూ మంత్రి పదవికి అర్రులు చాచలేదని, ఆ పదవి కావాలని ఎవర్నీ కోరలేదని, ఆరు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా పనిచేసానని డీఎల్ పేర్కొన్నారు. కాగా వైఎస్ మరణానంతరం వైఎస్‌ఆర్ జిల్లాలో రాజకీయ, ప్రభుత్వ కార్యాకలాపాలు కొన్ని నెలలపాటు స్తంభించిపోయాయని, కేవలం యువనేతను ముఖ్యమంత్రిని చేయాలని కొందరు నాయకులు నా దగ్గరికి సంతకాలు చేయాలని కోరారన్నారు. 2009లో వరదలు వచ్చినపుడు యువ నేతతో కలిసి వరదప్రాంతాల్లో పర్యటించేసమయంలో పరామర్శల సంగతి ఎలా ఉన్నా అక్కడ కూడా యువనేతను సీఎం చెయ్యాలని చోటా నాయకులు ప్రవర్తించిన తీరును గుర్తుచేసుకుని మంత్రి ఆవేదన వ్యక్తంచేసారు.courtesy---surya

0 comments:
Post a Comment