|
మమ్మల్ని మేనేజ్ చేయడానికి మేమేమి గొర్రెలు,, బర్రెలం కామని కాంగ్రెస్ పార్టీ ఎంపీల కన్వీనర్ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. తెలంగాణ అంశంలో రాజీ ధోరణి లేదని తెగేసి చెప్పారు. శ్రీకృష్ణ కమిటి నివేదిక ఏక పక్షంగా వుందని, ఈ కమిటీ అధ్యయనాలపై విచారణ జరిపించాలని ప్రభాకర్ ఢిల్లీలో డిమాండ్ చేశారు. గురువారం ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు శ్రీకృష్ణ కమిటిపై నిప్పులు చెరిగారు. సీమాంధ్రప్రాంత నాయకుల ప్రలోభాలకు తలొగ్గి ఏక పక్షంగా నివేదికను తయారు చేశారని ఆరోపించారు. courtesy-- surya

0 comments:
Post a Comment