|
టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సిద్ధాంతాలను ప్రస్తుత నేతలు మంటగలుపుతున్నారని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌తో జతకట్టిన టీడీపీకి ఎన్టీఆర్ పేరును వాడుకునే నైతిక హక్కు లేదని ఆమె అన్నారు. దీనిపై హైకోర్టులో కేసు వేయనున్నట్లు ఆమె శుక్రవారంఇక్కడ తెలిపారు. చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ఆశయాలను పూర్తిగా విస్మరించారన్నారు. ఎన్టీఆర్ పేరు, ఫోటోలు పెట్టకుని ప్రచారం చేయవద్దని ఆమె కోరారు. వైఎస్‌ఆర్, ఎన్టీఆర్ పథకాలను అమలు చేస్తారనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తాను అండగా ఉన్నానని లక్ష్మీపార్వతి తెలిపారు. courtesy --sakshi |

0 comments:
Post a Comment