శాసనసభలో ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా అడ్డుకుంటూ, విలువైన సమయాన్ని వృధా చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పితాని సత్యనారాయణ విమర్శించారు. ఎపిఐఐసి చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యంను పరామర్శించేందుకు శనివారం ఆయన ఇంటికి వచ్చిన పితాని తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడుతూ భూకేటాయింపులు, సెజ్‌లపై సమగ్ర చర్చ జరగకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతోందన్నారు. ఈ విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. భూ కేటాయింపులపై చర్చ జరగకుండా సభా సంఘం, సంయుక్త శాసనసభా కమిటీ వేయాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదని, ఇది ఎన్నడూ జరగలేదన్నారు. భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు తేలితే జెఎల్‌సి లేదా సభా కమిటీని వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పితాని చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఉపాధి కల్పించాలన్నదే తమ లక్ష్యమన్నారు
Tagged as : Congress
T.D.P
0 comments:
Post a Comment