అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు అత్యంత ప్రతి ష్ఠాత్మకమైన కడప జిల్లా ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ రెండు పార్టీల మధ్య మాటల తూటాల వేగం పెరిగిపోతున్నది. రాష్ట్ర ప్రజానీకం దృష్టి అంతా కడప లోక్‌సభ, పులివెందుల శాసన సభకు జరిగే ఉప ఎన్నికలపై ఉండటం, ఎన్నికలలో విజయం జగన్‌కు ప్రతిష్ఠాత్మకం కావటం, ఇటు వైపు వ్యవసాయ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా విజయం సాధిం చాలన్న పట్టుదలతో ఉండటం వంటివి రెండు పార్టీల మధ్య వేడిని మరింత పెంచుతున్నాయి.
శాసనసభ సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యు లపై దాడికి దిగిన వివేకా ఆ తర్వాత వివరణ ఇస్తూ తనను లక్ష్మణుడిగా, దివంగత ముఖ్యమంత్రి, తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డిని రాముడుగా అభివర్ణించారు. ఆ మాటనే జగన్ వర్గం ఇప్పుడు తూటాగా ఉపయోగించుకుని కాంగ్రెస్‌ను, వివేకా ను టార్గెట్ చేసుకుని విమర్శిస్తున్నది. పైగా పులివెం దులలో శుక్రవారం మాట్లాడిన సందర్భంగా ప్రతి సారీ వైఎస్ సెంటిమెంటు పని చేయదని వివేకా చేసిన వ్యాఖ్య జగన్ వర్గానికి మరో అస్తమ్రైంది.
Congress,
T.D.P,
YSR Congress
Tagged as : Congress
T.D.P
YSR Congress
0 comments:
Post a Comment