|
జాతీయ పార్టీలు నైతిక విలువలు, పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రాంతీయ పార్టీలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడం వల్లే తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని మంత్రి బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధాంతాలకు విరుద్దంగా గెలుపు లక్ష్యాలతో పార్టీలు ఎన్నికల్లో పోటిచేస్తే ప్రజలు ఎంతమాత్రం విశ్వసించరని, ఈ విషయాన్ని ఇప్పటికైనా తమ పార్టీ అధినాయకత్వాలు గ్రహించాలని ఆయన బుధవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ముచ్చటిస్తూ పేర్కొన్నారు. గెలుపు కోసం ఇన్ని అడ్డదారులు తొక్కేకంటే.. దీని కంతటికి కారణమైన ఆఒక్కడి కాళ్ల మీదపడితే పోదా..? అని మంత్రి బొత్స వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం విశేషం.

0 comments:
Post a Comment