రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రం నిలువు దోపిడీకి గురైందన్నారు.అవినీతి నుంచి దేశాన్ని విముక్తి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఇవి బాబు మధ్యానం మీడియా తో అన్న మాటలు.. ఇందులో ఏముంది అంటారా...తెదేపాచిత్తూరు జిల్లా సత్యవేడులో పార్టీ మీటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాని కి స్థానిక ఎమ్మెల్యే హైమావతితో పాటు సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే హైమావతి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మంచి పార్టీ అని, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలంతా మంచి క్రమశిక్షణ కలిగిన వారని కాని అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే పెద్ద అవినీతి పరుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు వేరే పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తుంటే ...వీళ్ళు బాబుకే ఎసరు పెడుతున్నారు..
0 comments:
Post a Comment