|
కలిసున్నంత కాలం సొంత పార్టీ లో స్కాంలు కుంభకోణాలు జరిగినా నోరేత్తరు ...అదే పరిస్థితి కొంచెం తేడా అయితే ఇదిగో ఇలానే ఉంటుంది...విషయంలోకి వెళ్తే...
విజయ వాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన పవర్ ప్రాజెక్ట్ కి సంబంధించి 41 కోట్లు పెనాల్టి ఎగ్గోట్టారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.లాంకో పవర్ సకాలం లో ఉత్పత్తి ప్రారంభించక పోవడం తో పెనాల్టి విధించారని ప్రభాకర్ అన్నారు .పదవి అడ్డు పెట్టుకుని రాజగోపాల్ పెనాల్టి మొత్తాన్నిఇప్పటివరకు చెల్లించ లేదని అన్నారు .వక్ఫ్ భూముల వ్యవహారం పై లగడపాటి స్పష్టమైన ప్రకటన చేయాలనీ డిమాండ్ చేసారు.
తను అవినీతి కి పాల్పడినట్టు రాజగోపాల్ నిరూపిస్తే ఏ శిక్ష కైనా సిద్ధం అన్నారు.దమ్ముంటే లగడపాటి కరీంనగర్ నుంచి పోటీ చేయాలనీ సవాల్ విసిరారు. రాజ గోపాల్ గురించి రోజుకో ఆరోపణ చేస్తానని ,వాటికీ అయన సమాధానాలు చెప్పుకోవాలన్నారు.
అసలు రాజకీయ నాయకులు నీతి నియమాలు లేని వాళ్ళు...నిన్నగాక మొన్న తెదేపా బహిష్కృత నేత నాగం మీద ఇల్లాగే ఆరోపణ చేసారు తెదేపా నేత ఎర్రబెల్లి ...ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారి వంతు..తమలో తామకి ఎవినా స్పర్ధలు వస్తే ఇలాంటి ఆరోపణలు చేస్తారు..తప్ప ముందే ఎందుకు బయటపెట్టరు ???
అంటే ఆరోపిస్తున్న వాళ్ళు కుడా నిజాయతీ పరులు కాదని అర్ధం .

0 comments:
Post a Comment