|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి అధికార పిచ్చిపట్టిందని రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. ఆయన స్వార్థం వల్లే ఈ ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. అందువల్ల ఓటర్లు కాస్త విజ్ఞతతో ఆలోచన చేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆయన కడప జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజల ముందున్న ఎన్నికలు కేవలం జగన్మోహన్ రెడ్డి స్వార్థం వల్ల వచ్చాయన్నారు. అనునిత్యం సోనియాగాంధీని పొగుడుతూ ఆమె అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్ సి.ఎం.గా పనిచేసిన వైఎస్ ప్రజల అభిమానాన్ని సంపాదించాడన్నారు.
వై.ఎస్. వేరు కాదు, కాంగ్రెస్ పార్టీ వేరుకాదని వైఎస్ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమని ఆయన చెప్పుకొచ్చారు. వై.ఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కాంగ్రెస్‌వేనని, వాటి అమలు బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదేనని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోను కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనునిత్యం అందుబాటులో ఉండే డి.ఎల్.రవీంద్రారెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

0 comments:
Post a Comment