|
భారత క్రికెట్ జట్టు కోచ్ కిర్‌స్టన్ జట్టు ఇక తన పదవిని వీడనున్నారు. ప్రపంచ కప్ 2011 వరకు ఆయన అగ్రిమెంట్ ఉంది. ఈ ప్రపంచ కప్‌తో ఆయన అగ్రిమెంటు ముగిసింది. దీంతో ఆయన జట్టు సభ్యులు ఆయనను కోచ్‌గా బాధ్యతలను కొనసాగించాలని అర్థించారు. దీనికి ఆయన సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఈ మూడేళ్లు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాన్ని మిగిల్చిందని ఆయన అన్నారు. భారత ఆటగాళ్ల ఆట తీరు అద్భుతమని ప్రదర్సించారు.
ఒప్పందం పునరుద్దరించుకోవాలనే ఉద్దేశ్యం లేదన్నారు. ఈ మూడేళ్లు తాను సొంత ఇంటిలో ఉన్నట్టుగా ఫీలయ్యానని చెప్పారు. ఎన్నో రోజుల కష్టం ఫలితంగా ప్రపంచ కప్పును భారత్ సొంతం చేసుకుందని ఆయన అన్నారు. ప్రపంచ కప్పు భారత్‌కు అందించిన టీమ్‌కు కోచ్‌గా ఉండటం ఆనందంగా ఉందని అన్నారు. కాగా కిర్‌స్టన్ కోచ్‌గా వచ్చిన తర్వాత భారత జట్టులో పూర్తిగా కలిసిపోయాడు. ఆయన ఆటగాళ్లలో ఒక్కడిగా ఉంటూ వారిని ఈ మూడేళ్లలో ప్రపంచ కప్ సాధించే దిశలో తీర్చి దిద్దారు. కప్ గెలిచిన తర్వాత జట్టు సభ్యులు సచిన్‌తో పాటు కిర్‌స్టన్‌ను కూడా భుజాలపై ఎత్తుకొని తిరిగారంటే ఆయన సభ్యులతో ఎలా కలిసిపోయారో అర్థం చేసుకోవచ్చు.

0 comments:
Post a Comment