|
దీనిపై అంబటి రాంబాబు మాట్లాడుతూ కడప, పులివెందుల ఉపఎన్నికల్లో ఫ్యాన్ స్టార్ట్ అయ్యిందని, ఫ్యాను గాలి పెనుగాలిగా మారనుందన్నారు. ఆ పెనుగాలిని తట్టుకోలేక 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్, 30 ఏళ్ల చరిత్ర కలిగిన తెదేపాలు కూకటివేళ్లతో సహా కొట్టుకుపోవడం ఖాయమన్నారు.
ఉపఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతాయని అంబటి జోస్యం చెప్పారు. కడప, పులివెందులలో పోటీ చేస్తున్న వైఎస్‌ఆర్ పార్టీ నేతలు జగన్, విజయమ్మలకు కేంద్ర ఎన్నికల కమిషన్ కామన్ సింబల్ కేటాయించడాన్ని తొలి విజయంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

0 comments:
Post a Comment