23 April 2011

ప్రజల ఆదరణే మాకు శ్రీరామరక్ష: వైఎస్.జగన్మోహన్‌రెడ్డి

ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు, తన తల్లి విజయమ్మకు నాన్న దీవెనలు, ప్రజల ఆదరణే శ్రీరామరక్ష అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో ప్రసంగిస్తూ.. నీతికి, అవినీతికి ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయన్నారు. తల్లీ, బిడ్డను ఓడించేందుకు రాష్ట్రంలోని క్యాబినెట్ మంత్రులు సగానికి పైగా కడప జిల్లాలో తిష్టవేసి అధికార, డబ్బుబలంతో నేతలను, ప్రజలను బెదిరిస్తున్నరాని ఆరోపించారు.
అయితే, అధికార పార్టీ నేతలు ఎన్ని చేసినా రాజశేఖర్‌ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచి పోయాయన్నారు. రాజకీయ బలంతో పోలీసు యంత్రాంగాన్ని కూడా రంగంలో దించి ఏడు వేల బైండోవర్ కేసులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పెట్టి వేధిస్తున్నారన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడే ప్రసక్తే లేదన్నారు.

Y.S.Jagan

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us