|
భగవాన్ సత్యసాయి బాబా పార్థీవ దేహానికి బుధవారం(ఈ నెల 27న) అంత్య క్రియలు జరుగుతామయని రాష్ర్ట మంత్రి గీతారెడ్డి తెలిపారు. బాబా మరణం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంయమనం పాటించాలని భక్తులకు ఆమె విజ్ఞప్తి చేశారు. బాబాను బతికించడానికి ప్రభుత్వ పరంగా అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు కూడా బాబాను కాపాడేందుకు శతవిధాలాల ప్రయత్నాలు చేశారన్నారు. బాబా పార్థీవ దేహాన్ని రెండు రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉంచుతామని చెప్పారు. భక్తులు క్రమశిక్షణతో బాబాకు వీడ్కోలు పలకాలని ఆమె కోరారు. పుట్టపర్తికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని గీతారెడ్డి తెలిపారు.

0 comments:
Post a Comment